కార్వేటినగరం: కూట మి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలను గాలి కి వదిలేసి వైఫల్యాలను ఎత్తి చూపే ప్రజాగొంతుకను నిర్బంధించలేర ని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి ముందస్తు సమాచారం, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి అమరావతిలో అరెస్టు చేయడాన్ని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసి అరాచకాలు సృష్టించి వైఎస్సార్‌సీపీ నాయకులను అణగదొక్కాలని యత్నిస్తున్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులను పావుగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పోలీసులు అత్యుత్సాహంతో శ్రీహరిని అరె స్టు చేశారని, అయితే కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఇది కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందని వ్యాఖ్యానించారు. ఎప్పటికై నా ధర్మం, న్యాయం గెలుస్తుందని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వానికి గుణపాఠం అన్నారు.
జనగణన శిక్షణ పరిశీలన
చిత్తూరు అర్బన్: జనగణన –2027లో భాగంగా చిత్తూరు సంతపేట పీఎన్‌సీ.మునిసిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ తరగతులను గురువారం కలెక్టర్ సుమిత్‌కుమార్ పరిశీలించారు. శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లతో మాట్లాడారు. శిక్షణలో భాగంగా జనగణన సర్వేపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఇదే సమయంలో పోర్ట ల్‌లో అందుబాటులో ఉన్న ‘స్వీయ గణన’ పైన అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ అధికారి డా.లోకేష్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు నాగేంద్ర, సుభప్రభ, మాస్టర్ ట్రైనర్ సౌందర్‌రాజన్, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు.
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లా లోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు పేర్కొన్నారు.


