కాంట్రాక్టర్ అక్రమాలు బట్టబయలు బంగారుపాళ్యం నుంచి తిరుపతికి యథేచ్ఛగా రవాణా ఓ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుని కమర్షియల్ విక్రయాలు
మేం చెప్పిందే చేయాలి!
పాలసముద్రం : ‘మేం చెప్పిందే చేయాలి. లేకుంటే మీరు బదిలీ కావడం ఖాయం. ఎమ్మెల్యే మా వాడే. ఆయనకు చెప్పి మిమ్మల్ని ఇక్కడ లేకుండా చేస్తాం..’ అంటూ స్థాని క ఎమ్మెల్యే థామస్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నా రు. తరచూ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులను వేధిస్తున్నారు.ఎర్రమట్టి, గ్రావెల్, డీకేటీ భూమి, ఖాళీ స్థలాలు, క్వారీలు వంటి వాటిని ఫైల్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో భూ రీసర్వే సైతం తమ కనుసన్నల్లోనే చేయాలని వేధి స్తున్నారు. శ్రీకావేరిరాజుపురం పంచాయతీకి చెందిన ఒక చోటా టీడీపీ నాయకు డు మండలంలోని 13 పంచాయతీల్లో ఏ ఒక్కటి చేయాలన్నా.. తనను అడిగి చేయాల్సిందేనని, లేకుంటే ఎమ్మెల్యేకు మీపై లేనిపోనివి చెప్పి ఇక్కడి నుంచి వెళ్లగొడతానని భయపెడుతున్నట్టు తెలుస్తోంది. వనదుర్గాపురం పంచాయతీకి చెందిన మరో చోటా నేత తాను చెప్పిందే చేయాలి.. లేకుంటే ఎమ్మెకు ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నట్టు సమాచారం. చోటా నేతల ఒత్తిడి తట్టుకోలేక.. పై అధికారుల నుంచి ఛీవాట్లు తినలేక రెవెన్యూ అధికారులతోపాటు మరిన్ని శాఖల వారు తల్లడిల్లిపోతున్నారు.
ఆ నియామకాలపై చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల నుంచి అందిన ఫిర్యా దుల మేరకు రాష్ట్ర లోకాయుక్త సంస్థ విచారణ చేపట్టగా, కొంతమంది తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లపై జిల్లా పరిపాలన అధికారులు రద్దు చేశారు. వారి సేవా కాలంలో పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయనున్నారు. సదరు వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరో ఉద్యోగి విషయంలో సర్టిఫికెట్ల నిజానిజాలు నిర్ధారించలేకపోవడంతో అతనిపై ఎలాంటి చర్య అవసరం లేదని తేలింది.
యమ కంకరుడు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: హైవే నిర్మాణం పేరుతో కంకర దోపిడీ జరుగుతున్న ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బంగారుపాళ్యం మండలం నుంచి తిరుపతి వైపు భారీగా కంకర అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో మైనింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాలు.. హైవే పనుల కోసం అనుమతులు పొందిన కాంట్రాక్టర్, ఆ అనుమతుల ముసుగులో కంకరను ప్రైవేటుగా విక్ర యిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. బంగారుపాళ్యం ప్రాంతం నుంచి రోజూ టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో కంకరను తరలిస్తూ కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అనుమతి తీసుకుని ఇతర జిల్లాల్లో విక్రయించడంపై స్థానికు లు, మైనింగ్ శాఖ అధికారులు భగ్గుమన్నారు. అంతేకాకుండా ఓ ప్రజాప్రతినిధి పేరును ఉపయోగిస్తూ ఈ అక్రమ రవాణా కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు అక్రమంగా కంకర తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని, లోడును అక్కడికక్కడే ఖాళీ చేయించారు. ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వమని తేల్చిచెప్పారు. నిబంధన లు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు హెచ్చరించారు.
హైవే ముసుగులో కంకర దందా


