ఇరగదీశారు భయ్యా! | - | Sakshi
Sakshi News home page

ఇరగదీశారు భయ్యా!

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

● రూ.179.66 కోట్ల ఆదాయం ● 59,354 డాక్యుమెంటేషన్లు

పుంజుకున్న రిజిస్ట్రేషన్‌ రాబడి

చిత్తూరు కార్పొరేషన్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ రాబడి పుంజుకుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి సాధించింది. 2025–2026 ఆర్థిక సంవత్సరం పరంగా జిల్లాలోని మొత్తం 8 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వాటికి రూ.186.17 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. అందులో రూ.179.66 కోట్ల ఆదాయంతో 96.51 శాతం వసూళ్లు రాబట్టారు.

సెప్టెంబర్‌ నుంచి పెరిగిన ఆదాయం

స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం సెప్టెంబర్‌ నుంచి పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మార్చి 30న ఒకరోజే జిల్లాలో రూ.3.25 కోట్ల ఆదాయం రాగా 1,458 డ్యాకుమెంటేషన్లు జరిగాయి. సెప్టెంబర్‌ నుంచి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. ఆదాయం కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రూ.221.89 కోట్ల లక్ష్యం ఇవ్వగా అందులో రూ.149.90 కోట్లు వసూళ్లతో 67.56 శాతం రాబడి వచ్చింది.

59,354 డాక్యుమెంటేషన్లు

జిల్లాలో మొత్తం 59,354 డాక్యుమెంటేషన్లు జరిగాయి. వీటి ద్వారా రూ.179.66 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పరంగా కుప్పం 161 శాతం, చిత్తూరు రూరల్‌ 120, నగరి 119, పలమనేరు 108 శాతంతో లక్ష్యాన్ని అధిగమించాయి. చివరిగా చిత్తూరు అర్బన్‌ 70 శాతం, కార్వేటినగరం 74, పుంగనూరు 88, బంగారుపాళ్యం 93 శాతం రాబడి వచ్చింది. డాక్యుమెంటేషన్లపరంగా చూస్తే కుప్పంలో 13,634, చిత్తూరు అర్బన్‌ 10,497, పలమనేరు 9,740, పుంగనూరు 8,630, చిత్తూరు రూరల్‌ 5,745, కార్వేటినగరం 4,162, నగరి 3,476, బంగారుపాళ్యం 3,461 జరిగాయి.

సబ్‌రిజిస్ట్రార్‌ లక్ష్యం రాబడి శాతం డాక్యుమెంటేషన్స్‌ కార్యాలయం రూ.కోట్లు రూ.కోట్లు

చిత్తూరు అర్బన్‌ రూ.66.38 రూ.46.63 70 10,497

కుప్పం రూ.19.08 రూ.30.89 161 13,634

చిత్తూరు రూరల్‌ రూ.13.29 రూ.15.98 120 5,754

నగరి రూ.12.29 రూ.14.73 119 3,476

పలమనేరు రూ.29.80 రూ.32.20 108 9,740

బంగారుపాళ్యం రూ.9.77 రూ.9.16 93 3,461

పుంగనూరు రూ.26.28 రూ.23.15 88 8,630

కార్వేటినగరం రూ.9.29 రూ.6.92 74 4.162

మొత్తం రూ.186.17 రూ.179.66 59,354

ఆదాయం పెరిగింది

గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం పెరిగింది. జిల్లాకు రూ.186.17 కోట్లు లక్ష్యం ఇవ్వగా అందులో 96.51 శాతంతో రూ.179.66 కోట్లు వచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ నుంచి రిజిస్ట్రేషన్ల తాకిడి పెరగగా మార్చి 30న ఒకరోజే రూ.3.25 కోట్లతో రికార్డ్‌ స్థాయిలో రాబడి వచ్చింది. నిర్ధేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అధిగమించాయి.

– రమణమూర్తి, జిల్లా రిజిస్ట్రార్‌

Advertisement
 
Advertisement
Advertisement