– కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు జారీ
తిరుపతి అర్బన్: సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్‌ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్‌మెంట్, మేకప్ (బ్రై డల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్లతోపాటు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే నెల 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్‌షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అదనంగా బ్యూటీ స్టూడియో, ఇన్‌స్టిట్యూషన్, బైరాగిపట్టెడ ఆర్చ్ రోడ్డు, కెనరా బ్యాంక్ పైన, తిరుపతి. శిక్షణ కూడా ఇక్కడే ఉంటుంది. ఇతర వివరాలకు 95534 54335, 96666 97219, నంబర్లను సంప్రదించగలరు.
మూల్యాంకన కేంద్రం వద్ద ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి సర్కారు బాధ్యతగా వ్యవహరించాలని ఫ్యాప్టో చైర్మన్ మణిగండన్ అన్నారు. ఆ సంఘ నాయకులు గురువారం పీసీఆర్ పాఠశాల మూల్యాంకన కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సర్యం చేస్తోందని మండిపడ్డారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ 12వ వేతన సవరణ వెంటనే అమలు చేయాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ మునీర్, రాష్ట్ర నాయకులు నరోత్తమరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


