నియామకాలు | - | Sakshi
Sakshi News home page

నియామకాలు

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్‌సీపీలో పదవులు కల్పిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశా లు జారీచేశారు. రాష్ట్ర అనుబంధ విభాగాలలో వారికి చోటు కల్పించారు. ఈ మేరకు గురు వారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన వై.వెంకటస్వామి, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శిగా జీడీనెల్లూరుకు చెందిన ఎ.విజయకుమార్‌, రాష్ట్ర ఆర్‌టీఐ విభాగ కార్యదర్శిగా జీడీనెల్లూరుకు చెందిన ఎం.గోపినంథన్‌ను నియమించారు.

నేడు కరెంటోళ్ల జనబాట

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటి ని దశలవారీగా పరిష్కారించనున్నట్లు వివరించారు.

సమష్టిగా

రోడ్డు ప్రమాదాల నివారణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో, సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జాతీయ రహదారుల్లోని బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద అందుబాటులో ఉన్న ఆస్పత్రులు, అంబులెన్స్‌ సేవలు, వైద్యుల ఫోన్‌ నంబర్ల తదితర వాటిని సిద్ధం చేయాలన్నారు. ఈ వివరాలు పోలీసు, రెవెన్యూ అధికారుల వద్ద ఉంటే ప్రాణనష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 22 ప్రధాన బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించినట్లు తెలిపారు. చిత్తూరు–తమిళనాడు సరిహద్దు మార్గంలో బ్లింకర్‌లు, సైన్‌బోర్డులు, రోడ్డు మార్కింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మొగిలి ఘాట్‌లో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ తుషార్‌ డూడీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ వినియోగించాలన్నారు. విద్యాసంస్థల్లో హెల్మెట్‌ వినియోగం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీటీసీ నిరంజన్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు పాల్గొన్నారు.

రూ.15 కోట్ల మంజూరు

చిత్తూరు కార్పొరేషన్‌: కుప్పంలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకు రూ.15 కోట్లు మంజూ రు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశాలు జారీచేశారు.

వైభవంగా

స్నపన తిరుమంజనం

కార్వేటినగరం: శ్రీవేణుగోపాలస్వామి ఆలయ వార్షిక వసంతోత్సవంలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. వంసతోత్సవం సందర్భంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామివారు వసంతమండపం వద్దకు వేంచేశారు. అనంతరం అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం ఆస్థానం చేపట్టారు. తర్వాత తిరుచ్చి వాహనంపై కొలువు దీర్చి మేళతాళాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ సూపరింటెండెంట్‌ మునిశేఖర్‌, ఆలయ అధికారి చంగల్‌రాయులు, అర్చకులు శభరి, గోపాలాచారి పాల్గొన్నారు.

నేటి కార్యక్రమాలు

వసంతోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామివారితో పాటు, ఆలయ ఆవరణంలో వెలసి ఉన్న శ్రీసీతాకోదండరాములవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం వాహన సేవలు జరగనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement