పాదయాత్రే సంక్షేమ పథకాలకు నాంది | - | Sakshi
Sakshi News home page

పాదయాత్రే సంక్షేమ పథకాలకు నాంది

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

● సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్‌ రాజశేఖరరెడ్డి ● తండ్రిబాటలో నడిచిన తనయుడు జగనన్న ● డిప్యూటీ మాజీ సీఎం నారాయణస్వామి

కార్వేటినగరం: ‘రాష్ట్రం ప్రజల కోసం సుపరి పాలన అందించి చరిత్ర సృష్టించారు. ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాని నిలుపుకున్న మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్తు ప్రపంచ దేఽశాల్లో ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. పలు రాష్ట్రాలు ఆయన పాలనను కొనియాడతూ అదే పథకాలను ఆయా రాష్ట్రాలలో అమలు చేశారని గుర్తుచేశారు. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రను ప్రారంభించి నేటికి 23 ఏళ్లు అవుతోందని చెప్పారు.

చరిత్రలో నిలిచిన సంక్షేమ పథకాలు

ఇల్లు లేని పేదలను ఆదుకోవడా నికి ఇందరమ్మ ఇళ్లు, అప్పుల ఊబిలో కూరుకు పోయిన రైతన్నలకు రైతు రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌ అమలు చేశారన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేద రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ, 108 వాహనాలు తీసుకొచ్చారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా నిలి చారని కొనియాడారు.

జగనన్న పాలనలో ...

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి కన్నా రెండడుగులు ముందుకేసి మరిన్ని సంక్షేమ పథకాలు అందించారని నారాయణస్వామి తెలిపారు. ఇందులో నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. పేదలందరికీ ఇళ్లు, ఇంటిి వద్దకే పాలన అంటూ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలు చేశారన్నా రు. రైతులకు రైతు భరోసా, మత్స్యకార భరోసా, ఆసరా, డ్వాక్రా రుణ మాఫీ, పంటలకు గిట్టుబాటు ధర, ఇన్‌పుట్‌ సబ్సి డీ అందించారని తెలిపారు. అదేవిధంగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, విద్యాదీవెన, వసతిదీవెన, విదేశీ విద్యాదీవెన వంటివి రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలో నిలిచిపోయే పథకాల సృష్టికర్తగా ప్రజల గుండెల్లో నిలిచారని చెప్పారు.

బాబు బాదుడే బాదుడు

ఆధికారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీని మరచి, బాదుడే బాదుడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు మునిగితేలుతున్నారని మాజీ డెప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. మందు బాబులకు నాణ్యమైన మద్యం అతి తక్కువ ధరకు ఇస్తానన్న మాట ఏమైందని నిలదీశారు. గ్రామాల్లో బెల్టుషాపులు, యువతకు అందుబాటులో గంజాయి అందిస్తున్నారని దుయ్యబట్టారు. కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement