టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిక
శ్రీరంగరాజపురం : మండలానికి చెందిన పిళ్లారుకుప్పం పంచాయతీ యల్లంపల్లి, పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు 20 మంది మంగుంట సర్పంచ్ రుపాశేషాద్రి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభివృద్ధికి కృషి చేసి టీడీపీని గెలిపించుకున్నామన్నారు. కానీ నేడు టీడీపీని గెలిపించున్నందుకు మాకు శాపంగా మారిందన్నారు. చిన్న పనులు చేసుకోవాలన్నా టీడీపీ పెద్ద నాయకులను కలవాలని లేకుంటే ఏ పనులు జరగడం లేదన్నారు. టీడీపీ జెండా మోసినందుకు తమ కు తగినశాస్త్రి జరిగిందన్నారు. జగనన్న పాలనలో రాజకీయలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తుంటే..కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. అందుకే టీడీపీలో ఇమడలేక , ఇందులో సామాజిక న్యాయం లేక సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్‌సీపీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుంటామన్నారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి... నరేంద్ర, కాశీ విశ్వ నాథరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కొదండరెడ్డి వారి తో పాటు పలువురికి పార్టీ కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మణి, ఎంపీపీ సరిత జనార్దన్, యూత్ విభాగం మండల అధ్యక్షులు జ్ఙానేంద్ర, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, హరిరెడ్డి, మహేష్ పాల్గొన్నారు.
బంగారుపాళెం మండలంలో..
బంగారుపాళెం: మండలంలోని ముంగరమడుగు గ్రామంలో ఆదివారం టీడీపీకి చెందిన యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ భువనేశ్వరి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో గ్రామానికి చెంది న యువకులు రాజ్‌కుమార్, హరీష్, మూర్తి, గుణశేఖర్ పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం, విద్యార్థులు, యువతను మోసగించిందన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న నారాయణస్వామి, కృపాలక్ష్మి
టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న డాక్టర్ సునీల్‌కుమార్
టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిక


