
నాణ్యమైన మద్యాన్ని గుర్తించండి
చిత్తూరు అర్బన్: కల్తీ లేనటువంటి నాణ్యమైన్య మద్యాన్ని మొబైల్ యాప్ ద్వారానే గుర్తించవచ్చని జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ అన్నారు. శుక్రవారం చిత్తూరులోని మద్యం దుకాణాల్లో ఎకై ్సజ్ సురక్ష యాప్ పనితీరును మద్యం ప్రియులకు వివరించారు. మొబైల్ యాప్‌లో ఎకై ్సజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని మద్యం బాటిల్ వద్ద ఉన్న స్కాన్ చేస్తే నాణ్యమైన మద్యం వివరాల మొత్తం మొబైల్‌లోనే చూపిస్తుందన్నారు. ఇలాంటి వివరాలు రాకపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాస్, అర్బన్ సీఐ శ్రీహరిరెడ్డి పాల్గొన్నారు.
కోయిల్ ఆళ్వార్
తిరుమంజనం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఈనెల 20న దీపావళి ఆస్థానం నేపథ్యంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైన వాటిని నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ మునిశంకరన్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్‌బాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,521 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

నాణ్యమైన మద్యాన్ని గుర్తించండి