
కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం
శాంతిపురం : పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త కెఆర్జే భరత్ తెలిపారు. మండలంలోని ఏడవమైలు వద్ద శుక్రవారం మొరసనపల్లి, కడపల్లి, కర్లగట్ట, తుమ్మిశి, అబకలదొడ్డి, నడింపల్లి పంచాయతీల పార్టీ కమిటీలు ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో క్యాడర్‌కు జరిగిన నష్టాన్ని గుర్తించిన అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇకపై వారికి తగిన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కమిటీల్లో కోవర్టులు, అవకాశవాదులకు చోటు లేకుండా యువత, సోషల్ మీడియా సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు. పంచాయతీల వారిగా క్రియాశీలక కార్యకర్తలు పార్టీ అధినేతతో కలిసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అధికారం వుండగా పార్టీలోకి వచ్చిన అవకాశవాదులు ఇప్పుడు పార్టీని వీడారని భరత్ చెప్పారు. వారి వల్లే కుప్పంలో పార్టీ 75 వేల ఓట్లకు పరిమితమైనట్టు తెలిపారు. అన్యాయం జరిగిన వారు, రాజకీయ వేధింపులకు గురయ్యే వారు డిజిటల్ బుక్ నమోదు చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణ చేయటానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, పార్టీ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఏవీ జయరాం, జగదీష్, ఆర్ముగం, విజయకుమార్, పట్టాభి, గజ్జల రమేష్, ప్రభాకర్‌రెడ్డి, నగేష్, వీరబద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కమిటీల అధ్యక్షులు వీరే:
మొరనపల్లి పంచాయతీ పార్టీ అధ్యక్షుడుగా జానకీరాం, గౌరవాధ్యక్షులుగా కాంతారావ్, కొండన్న వెంకటేష్, అబకలదొడ్డి పంచాయతీ అధ్యక్షుడుగా వీరప్ప, గౌరవాధ్యక్షులుగా పి.మణి, ఆదినారాయణ, కడపల్లి పార్టీ అధ్యక్షుడుగా ఎం.మురుగేష్, గౌరవాధ్యక్షులుగా వెంకటస్వామి, వెంకటేష్, తుమ్మిశి పార్టీ అధ్యక్షుడుగా చంగమరాజు, గౌరవాధ్యక్షులుగా టిపి భాస్కర్, ఎండి బాబు, నడింపల్లి పార్టీ అధ్యక్షుడుగా పిఎం రమేష్, గౌరవాధ్యక్షులుగా కృష్ణప్ప, మునివెంకటప్పలతో పాటు ఆయా పంచాయతీ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను ఎన్నుకున్నారు.