
22న జాబ్‌మేళా
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్‌లో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులతో కలిసి శుక్రవారం జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న సూళ్లూరుపేట సత్యసాయి కల్యాణ మండపంలో జాబ్ మేళా ఉందని చెప్పారు. తమతో పాటు పలువురు అధికారులు, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల 20వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 21 కంపెనీలకు చెందిన ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పారు. పదో తరగతి నుంచి ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా పీజీ చదువుకున్న యువతి యువకులు అర్హులుగా పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9121646661, 9985056929, 9988853335 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాధం, పరిశ్రమలశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ భరత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఏ అడిషనల్ పీడీ ప్రభావతి, జిల్లా ప్లేస్ మెంట్ అధికారి గణేష్ పాల్గొన్నారు.