
బిగిసిన పిడికిళ్లు!
ఉరిమిన కళ్లు..
ప్రశ్నించే కలానికి సంకెళ్లా?
‘ప్రజల గొంతుకగా నిలిచే పత్రికా రంగాన్ని అణగదొక్కాలనుకోవడం అవివేకం. ఒక పత్రికపైనే కక్ష సాధింపులకు పాల్పడి వేధింపులకు దిగడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. నిరంకుశత్వానికి పరాకాష్ట. ఇలాంటి చర్యలు మానుకోవాలి. ‘సాక్షి’పై వేధింపులు.. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలి. లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తాం. న్యాయం జరిగేవరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నిరసనలు మిన్నంటించారు. ‘సాక్షి’పై కక్షగట్టడమేంటని ప్రశ్నించారు. తప్పొప్పులు జరిగితే ఖండించాల్సింది పోయి.. విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించడం భావ్యం కాదన్నారు. పోలీసుల తీరును ఎండగట్టారు.
చిత్తూరు అర్బన్ : వ్యవస్థలో లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్న పత్రికలపై కేసులు నమోదు చేయడం.. వేధింపులకు గురిచేయడం.. ప్రశ్నించే కలానికి సంకెళ్లు వేయడమేనని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్ క్లబ్ నాయకులు ధ్వజమెత్తారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పాత్రికేయులపై కేసులు పెట్టడం దారుణమని ఎండగట్టారు. ప్రజాస్వామ్యమా.. నిరంకుశమా..? అంటూ నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని, వేధింపులు మానుకోవాలని డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.

బిగిసిన పిడికిళ్లు!

బిగిసిన పిడికిళ్లు!