
పార్టీ బలోపేతంలో గ్రామ కమిటీలు కీలకం
సదుం: పార్టీని బలోపేతం చేయడంలో గ్రామ కమిటీ సభ్యులు కీలకంగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మండలంలోని అమ్మగారిపల్లెలో పర్యటించారు. ఇటీవల నూతనంగా ఎంపికై నా పార్టీ గ్రామ కమిటీల విధి నిర్వహణపై నాయకులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కమిటీ సభ్యులు కీలకంగా పనిచేసేలా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. అనంతరం రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, నారాయణ రెడ్డి, రమేష్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లికార్జున, పురుషోత్తంరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.