జాబ్‌మేళాలో 373 మందికి ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాలో 373 మందికి ఉద్యోగాలు

Published Sat, Mar 2 2024 12:15 PM

ఉద్యోగాలకు ఎంపికై న వారితో ప్రిన్సపల్‌ తదితరులు  - Sakshi

పలమనేరు : పట్టణంలోని శ్రీవర్ర చెన్నారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జిల్లాస్థాయి మెగా జాబ్‌మేళా నిర్వహించారు. కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌, ఏపీఎస్‌ఎస్‌డీపీ సంయుక్తంగా చేపట్టిన మేళాలో19 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా రు. జిల్లావ్యాప్తంగా మొత్తం 557మంది అభ్యర్థులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. వీరిలో 373 మందికి కంపెనీల ప్రతినిధులు ఉద్యోగావకాశం కల్పించారు. ఉద్యోగాన్ని బట్టి వార్షిక వేతనంగా రూ. 1.8లక్షల నుంచి రూ.4.2లక్షల దాకా ఉంటుందని కంపెనీ హెచ్‌ఆర్‌లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిని కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటేశులు, వైస్‌ ప్రిన్సిపల్‌ విజయశేఖరం అభినందించారు.

సీసీ కెమెరాల వైర్లు కట్‌ చేయడంపై ఫిర్యాదు

కార్వేటినగరం : ఆర్కేఎస్సార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వైర్లను గుర్తుతెలియని దుండగులు కట్‌ చేసినట్లు ప్రిన్సిపల్‌ స్వరూప శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటకృష్ణ కళాశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. ఇంటర్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా సీసీ కెమెరాలను పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

కళాశాలలో పరిశీలిస్తున్న  ఎస్‌ఐ వెంకటకృష్ణ
1/1

కళాశాలలో పరిశీలిస్తున్న ఎస్‌ఐ వెంకటకృష్ణ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement