
యాదమరి: జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ బాబు
● జగనన్నతోనే పేదవాని మోములో శాశ్వత చిరునవ్వు ● అప్పలాయగుంట పల్లె నిద్రలో మంత్రి ఆర్కే రోజా ● ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కు అనూహ్య స్పందన
పుత్తూరు: ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి అంటే? ప్రజల సంక్షేమం కోసమేనని’ రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. శుక్రవారం వడమాలపేట మండలం అప్పలాయగుంట సచివాలయ పరిధిలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా ఒడ్డిపల్లెలో పల్లె నిద్ర చేశారు. అంతకు ముందు సచివాలయంలో నేటి ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా చేసిన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గత ప్రభుత్వానికి, నేటి జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న అమ్మఒడి, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేదోడు, వైఎస్సార్ బీమా, సున్నా వడ్డీ వంటి పలు సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధితో ప్రతి పేదవాని మోములో ఉన్న చిరునవ్వు శాశ్వతం కావాలంటే జగన్ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మోసపూరిత వాగ్దానాలను గుప్పిస్తోందని చెప్పారు. ఇందుకు పచ్చమీడియా పనికట్టుకొని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. గతంలో తాము చేసిన మంచిని చెప్పి ఓట్లు అడిగే స్థితిలో టీడీపీ లేదని, అందుకే అసత్య ప్రచారాలతో ప్రజల ముందుకు వస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ వడమాలపేట మండల కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సురేష్‌రాజు, శాప్ డైరెక్టర్ యాదవేంద్రరెడ్డి, డీఎల్‌ఎస్‌సీ మెంబర్ కిరణ్‌కుమార్, సోషల్‌మీడియా కన్వీనర్ చంద్రారెడ్డి, సర్పంచ్ శేషారెడ్డి, సింగిల్ విండో ప్రెసిడెంట్ సుధీర్‌రెడ్డి, పార్టీ నాయకులు లోకేష్‌రెడ్డి, అయ్యప్పరెడ్డి, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా..
● నగరి మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. రాయలసీమ వీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి పాల్గొన్నారు.
● చిత్తూరు సత్యనారాయణపురంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,మేయర్ అముద పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లెలో మండల కన్వీనర్ త్యాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
● పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
● పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం, వి.కోట మండలాల్లో ఎమ్మెల్యే వెంకటేగౌడ, జెడ్పీటీసీ పార్వతి, పెద్దపంజాణిలో మండల కన్వీనర్ బాగారెడ్డి, జెడ్పీటీసీ సుష్మ, ఎంపీపీ ఎన్.రెడ్డెప్ప, పలమనేరులో పార్టీ కన్వీనర్ బాలాజీనాయుడు, జెడ్పీటీసీ మల్లికరంగనాథం, బైరెడ్డిపల్లె జెడ్పీటీసీ కేశవులు, ఎంపీపీ ఎం.రెడ్డెప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు.
● కుప్పం నియోజకవర్గం కుప్పంలో మండల కన్వీనర్ మురగేష్, జెడ్పీటీసీ శరవణ, ఎంపీపీ అశ్విని, గుడుపల్లెలో మండల కన్వీనర్ రామకృష్ణ, జెడ్పీటీసీ కృష్ణామూర్తి, ఎంపీపీ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
● పుంగనూరు నియోజకవర్గం పుంగనూరులో ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ చెంగారెడ్డి, చౌడేపల్లెలో మండల కన్వీనర్ అంజిబాబు, జెడ్పీటీసీ దామోదారరాజు, ఎంపీపీ రామ్మూర్తి, సోమల మండల కన్వీనర్ గంగాధర్, జెడ్పీటీసీ కుసుమకుమారి, ఎంపీపీ ఈశ్వరయ్య, సదుంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మండల కన్వీనర్ ప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ యల్లప్ప, రొంపిచెర్లలో మండల కన్వీనర్ ఇబ్రహీంఖాన్, జెడ్పీటీసీ రెడ్డిశ్వరరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, పులిచెర్లలో మండల కన్వీనర్ నాద మునిరెడ్డి, జెడ్పీటీసీ మురళీధర్, ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
సంక్షేమానికి కేరాఫ్ జగనన్న
శ్రీరంగరాజపురం : సంక్షేమ పాలనకు చిరునామా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి అన్నా రు. మండలంలోని కొత్తపల్లె సచివాలయంలో జరిగిన రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ వ్యవస్థతో ప్రజలకు సంక్షేమ పాలనను చేరువ చేసిన చరిత్ర జగనన్నదని తెలిపారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈ నాలుగున్నరేళ్లలో అర్హులైన నిరుపేద ప్రజల ఖాతాల్లోకి రూ.4.69కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి భభరోసా జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. పేదవర్గాల భవిష్యత్ బాగుండాలన్నా, ఆత్మగౌరవంతో బతకాలన్నా మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సచివాలయంలో పథకాల లబ్ధి బోర్డును ఆవిష్కరించారు. జెడ్పీటీసీ సభ్యుడు రమణప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి, సర్పంచ్ డీల్లయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ మణి, ఎంపీపీ సరిత, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి