యస్‌ బ్యాంకునకు మరో షాక్

Yes Bank levied Rs 25 cr fine by SEBI in AT1 bonds misselling case - Sakshi

మోసపూరిత చర్యలు, 25 కోట్ల జరిమానా

కస్టమర్ల అనుమతి లేకుండా రిస్కీ బాండ్లపై  పెట్టుబడులు మళ్లింపు

ప్రభావితమైన పలువురు కస్టమర్లు

సాక్షి,ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకుకు మరోషాక్‌ తగిలింది. బాండ్లకు సంబంధించిన  మోసపూరిత చర్యల పాల్పడిందంటూ యస్‌ బ్యాంకుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ .25 కోట్లు జరిమానా విధించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1(అడిషనల్ టైర్ వన్ బాండ్లు) బాండ్ల వైపు మళ్లించారనేది  ఆరోపణ.

కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న తర్వాత విచారణ జరపగా, ఏటి-1 బాండ్ల విషయంలో వారి ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది.  2016 డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29,2020 మధ్యకాలంలో  వీటిని  విక్రయించినట్టు సెబీ  తెలిపింది. యస్ బ్యాంక్ యాజమాన్యం నేరుగా తమ బ్యాంక్‌లోని 1300 మంది కస్టమర్ల చేత వీటిని కొనుగోలు చేయించిందనీ, ఆయా పెట్టుబడులను సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండా రిస్కీ బాండ్లలోకి మార్చి విక్రయించిందని ఆరోపించింది. అధిక రాబడుల పేరుతో​ బ్యాంకు ఉద్యోగులు  మోసంగించారని సెబీ నిర్ధారించింది. తద్వారా 70,80,90 ఏళ్ల వయసున్న చాలామంది వినియోగదారులు ప్రభావితమయ్యారని వాదించింది. ఫలితంగా యస్ బ్యాంక్ ప్రవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కి చెందిన వివేక్ కన్వర్‌పై కోటి రూపాయలు, ఆశిష్ నాసా, జస్జీచ్ సింగ్ బంగాపై తలా రూ.50లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది సెబీ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top