షావోమి అద్భుత ఆవిష్కారం | Xiaomi unveils ludicrous transparent OLED TV  | Sakshi
Sakshi News home page

షావోమి అద్భుత ఆవిష్కారం

Aug 15 2020 12:43 PM | Updated on Aug 15 2020 1:28 PM

Xiaomi unveils ludicrous transparent OLED TV  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న షావోమి మరో కొత్త ఆవిష్కారానికి తెర తీసింది. ఎడ్జ్-టు-ఎడ్జ్  ట్రాన్స్ పరెంట్  గ్లాస్ డిస్ ప్లేతో, దృశ్యాలు గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలిగించేలా అద్భుతమైన ఎంఐ టీవీలను లాంచ్ చేసింది. 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టీవీలను ప్రదర్శించింది.

ఎంఐ టీవీ లగ్జరీ ట్రాన్సపరెంట్ ఎడిషన్ టీవీలను 55 అంగుళాల సైజులోమాత్రమే  తీసుకొచ్చింది. వర్చువల్,  రియల్‌ను విలీనం చేసి అపూర్వమైన అనుభవాన్ని అందించేలా ఈ టీవీలను డిజైన్ చేసింది.  టీవీ మాత్రమే కాకుండా, దీన్ని ఆఫ్ చేసినపుడు ఆర్ట్ పీస్ గా కనిపించే ఎంఐ టీవీ లక్స్ ట్రాన్సపరెంట్ ఎడిషన్  గ్యాలరీలు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్ , థియేటర్లకు కూడా చక్కగా అమరిపోతుందని  షావోమి ప్రకటించింది.

బ్యాక్ ప్యానెల్‌తో వచ్చే సాంప్రదాయ టీవీల మాదిరిగా కాకుండా, అన్ని ప్రాసెసింగ్ యూనిట్లను దాని బేస్ స్టాండ్‌లో సృజనాత్మకంగా పొందుపర్చడం విశేషం. అందుకే ఈ టీవీని ఆఫ్ చేసిన  బోర్డర్, బేస్, తప్ప మిగిలిన సెట్ పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దీంతో ఈ తరహా టీవీలను భారీగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే తొలి సంస్థగా షావోమి ఖ్యాతిని దక్కించుకుంది. ఆగస్టు 16 న చైనాలో ఈ టీవీల అమ్మకాలు ప్రారంభ మైనాయి. 7వేల డాలర్లు..అంటే సుమారు 5,23,982 రూపాయలు. మిగిలిన ఆసియా మార్కెట్లలో ఇవి అందుబాటులోకి వచ్చేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement