WhatsApp may be testing new look for Android app - Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. లుక్ మొత్తం మారనుందా?

Published Thu, Apr 6 2023 5:29 PM

Whatsapp testing new look for android app details - Sakshi

ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న మోస్ట్ పాపులర్ మేసేజింగ్ యాప్‌లో బెస్ట్ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'వాట్సాప్' (WhatsApp). ఎంతో మంది నిత్యజీవితంలో భాగమైపోయిన ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. అయితే త్వరలో ‘వాట్సాప్’ లుక్ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

నివేదికల ప్రకారం ఆండ్రాయిడ్ యాప్‍కు కొత్త 'యూజర్ ఇంటర్ఫేస్' ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఇది మునుపటికంటే చాలా ఆధునికంగా ఉండటమే కాకుండా ఫీచర్లను యూజర్లు సులభంగా ఉపయోగించుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం, ఆండ్రాయిడ్ యాప్ యూఐను పూర్తిగా మార్చేందుకు వాట్సాప్ సన్నదవుతోంది. ఇందులో భాగంగానే యాప్ బాటమ్‍లో నేవిగేషన్ బార్‌ను యాడ్ చేస్తోంది. బాటమ్ బార్‌లో చాట్స్, కమ్యూనిటీస్, స్టేటస్, కాల్స్ ట్యాబ్స్ ఉంటాయని దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా విడుదల చేసింది.

(ఇదీ చదవండి: అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ స్పెషలేంటో తెలుసా? ఎన్ని ​కోట్లు ఉంటుందంటే..?)

త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్స్ అన్నీ దాదాపు వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్‌ని ఐఓఎస్ యాప్‍లాగా మార్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బీటా అప్‍డేట్ 2.23.8.4 ఆండ్రాయిడ్ వెర్షన్‍లో వాట్సాప్ టెస్ట్ చేస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో  వెల్లడించింది.

ఇప్పటికీ కొంత మంది వాట్సాప్ బీటా యూజర్లకు కొత్త ఇంటర్ఫేస్‍తో కూడిన అప్‍డేట్ వచ్చేసింది. ఒకవేళ సాధారణ యూజర్ అయితే ఈ అప్‍డేట్ కోసం మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. బీటా యూజర్లు టెస్ట్ చేసిన తరువాత అందులో బగ్స్ ఏవీ లేవని నిర్దారించుకున్న తరువాత అప్‍డేట్‍ను వాట్సాప్ అందుబాటులోకి తెస్తుంది.

(ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో నయా కారు విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు)

అంతే కాకుండా వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఇది మెసేజ్ సెండ్ చేసిన తరువాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫీచర్స్ ప్రకారం మనం పంపించే మెసేజ్‍లో తప్పు ఉంటే దానిని డిలీట్ చేయడమే తప్పా వేరే మార్గం లేదు. వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ అందుబాటులో వచ్చిన తరువాత ఈ ఇబ్బందికి చెక్ పెట్టేయొచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఖచ్చితంగా తెలియదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement