Vivek Joshi holds review meeting with heads of Public Sector Banks - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక శాఖ సమీక్ష

Apr 14 2023 8:47 AM | Updated on Apr 14 2023 11:30 AM

Vivek joshi with chiefs of government banks - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) అధిపతులతో కేంద్ర ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి వివేక్‌ జోషి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జన సురక్ష, ముద్రా యోజన వంటి వివిధ ఆర్థిక స్కీములను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధాని బీమా పథకాల్లో మరింత మందిని చేర్చే దిశగా బ్యాంకులు తమ బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్స్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. 

ప్రాంతీయ భాషల్లోన వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జోషి సంనట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రోజంతా సాగిన ఈ సవవేశంలో పశు సంవర్ధక శాఖ, ఫిషరీస్, హౌసింగ్‌ తదితర శాఖల సీనియర్‌ అధికారులు, నాబార్డ్‌ చైర్మన్, ఎన్‌పీసీఐ సీఈవో మొదలైన వారు కూడా పాల్గొన్నారు. స్టాండప్‌ ఇండియా, పీఎం స్వానిధి తదితర స్కీముల పురోగతిని సైతం ఇందులో సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement