తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..

Published Thu, May 2 2024 3:15 PM

UPI transactions declined in volume and value in April

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు 2024 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో తగ్గాయి. మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో నెలవారీగా 1 శాతం, మొత్తం విలువలో 0.7 శాతం తగ్గినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.

మార్చిలో రూ.19.78 ట్రిలియన్లుగా నమోదైన యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఏప్రిల్‌లో రూ.19.64 ట్రిలియన్‌లకు చేరింది. మార్చిలో మొత్తం 13.44 బిలియన్ల సంఖ్యలో జరిగిన లావాదేవీలు ఏప్రిల్‌లో 13.3 బిలియన్ల​కు తగ్గింది. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్‌) లావాదేవీలు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 7 శాతం(రూ.6.35 ట్రిలియన్ల నుంచి రూ.5.92 ట్రిలియన్లు), విలువలో 5 శాతం(581 మిలియన్ల నుంచి 550 మిలియన్లు) తగ్గాయి. ఏప్రిల్‌లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు విలువలో 3 శాతం (మార్చిలో రూ.5,939 కోట్ల నుంచి ఏప్రిల్‌లో రూ.5,592 కోట్లు) తగ్గాయి. వాల్యూమ్‌లో 6 శాతం.. మార్చిలో 339 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్‌లో 328 మిలియన్లకు తగ్గాయి.

ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..

యూపీఐ చెల్లింపుల వాల్యూమ్‌లు, విలువలు నెలవారీగా తగ్గినా ఏడాది ప్రాతిపదికన మాత్రం ఘననీయంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వాల్యూమ్ పరంగా 50 శాతం, విలువలో 40 శాతం పెరిగాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement