టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన ధరలు!

TVS Motor Hikes Costs Of Jupiter 110 Scooter - Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ జూపిటర్ 110 కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఇటీవల జూపిటర్ 125 స్కూటర్ లాంచ్ చేసిన తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు తన అత్యంత ప్రజాదరణ పొందిన జూపిటర్ 110 స్కూటర్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరల పెంపుతో, జూపిటర్ 110 ఇప్పుడు ధర రూ.600 వరకు పెరగనుంది. టీవీఎస్ జూపిటర్ 110 వేరియెంట్ వారీగా కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • షీట్ మెటల్ వీల్: ₹66,273 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)
  • స్టాండర్డ్: ₹69,298 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)
  • జడ్ ఎక్స్ (డ్రమ్ బ్రేక్): ₹72,773 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)
  • జడ్ ఎక్స్ (డిస్క్ బ్రేక్): ₹76,573 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)
  • క్లాసిక్: ₹76,543 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)

టీవీఎస్ జూపిటర్ 109.7సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ చేత పనిచేస్తుంది. ఇది 7.37బిహెచ్ పీ పవర్, 8.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ స్కూటర్ ఎకోత్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్(ఈటి-ఫై) టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల 15 శాతం మెరుగైన మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీవీఎస్ జూపిటర్ లో డిస్క్-డ్రమ్ కాంబో బ్రేకింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కలిగి ఉంది. స్కూటర్లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్, మొబైల్ ఛార్జర్ కూడా ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇన్ టెల్లిగో టెక్నాలజీ కలిగి ఉంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top