హైదరాబాద్‌ టూ రాజమండ్రి.. ఫ్లైట్‌ సర్వీసులు ప్రారంభించనున్న సంస్థ | Trujet will Resuming Its Flight Operations From February 23 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టూ రాజమండ్రి.. ఫ్లైట్‌ సర్వీసులు ప్రారంభించనున్న సంస్థ

Feb 22 2022 8:35 AM | Updated on Feb 22 2022 9:00 AM

Trujet will Resuming Its Flight Operations From February 23 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్‌ తన సేవలను ఫిబ్రవరి 23 నుంచి తిరిగి ప్రారంభిస్తోంది. వివిధ పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి 5 నుండి కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచాయని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్‌–విద్యానగర్‌–హైదరాబాద్, విద్యానగర్‌–బెంగళూరు–విద్యానగర్, బెంగళూరు–బీదర్‌–బెంగళూరు, హైదరాబాద్‌–రాజమండ్రి–హైదరాబాద్, హైదరాబాద్‌–నాందేడ్‌–హైదరాబాద్, ముంబై–నాందేడ్‌–ముంబై, ముంబై–కొల్హాపూర్‌–ముంబై, ముంబై–జల్గావ్‌–ముంబై రూట్లలో సర్వీసులు ఉంటాయని ట్రూజెట్‌ ఎండీ వి.ఉమేశ్‌ సోమవారం వెల్లడించారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement