సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Today Stock Market Updates In Sakshi Money Mantra On 7 Feb 2024 | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Feb 7 2024 9:30 AM | Updated on Feb 7 2024 9:44 AM

Today Stock Market Update By Sakshi Money Mantra 7 Feb 2024

మంగళ వారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు.. ఈ రోజు (బుధవారం) ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలయ్యే సమయానికి సెన్సెక్స్ 353.37 పాయింట్ల భారీ లాభంతో 72539.46 వద్ద, నిఫ్టీ 112.70 పాయింట్ల లాభంతో 22042.10 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా బ్రిటానియా, కోల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), భారతీ ఎయిర్‌టెల్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఆల్కెమ్ లేబొరేటరీస్ లిమిటెడ్ సంస్థలు చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ కంపెనీ, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, పెట్రోనెట్ LNG లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement