సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Today Stock Market Update 30 January 2024 | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Jan 30 2024 9:28 AM | Updated on Jan 30 2024 9:39 AM

Today Stock Market Update 30 January 2024 - Sakshi

లాభాలతోనే శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 150.28 పాయింట్ల లాభంతో 72091.85 వద్ద, నిఫ్టీ 59.95 పాయింట్ల లాభంతో 21797.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.

బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఐటీసీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement