లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు! | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

Published Mon, May 16 2022 4:10 PM

Today Stock Market Update - Sakshi

దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2020 తర్వాత తొలిసారిగా గత వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా వారం రోజుల పాటు నష్టాలతో కొట్టుమిట్టాడాయి. కానీ ఈ వారంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగిన నష్టాలకు స్టాక్‌ మార్కెట్లు చెక్‌ పెట్టాయి. దీంతో సోమవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 

బిఎస్‌ఈ సెన్సెక్స్ 180 పాయింట్లుతో  0.34 శాతం పెరిగి 52,974 వద్ద ముగియగా, నిఫ్టీ 60 పాయింట్లతో 0.38 శాతం పెరిగి 15,842 వద్ద స్థిరపడింది. 

ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్‌,ఎన్టీపీసీ,యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బీఐ, మారుతి సుజికీ, బజాజ్‌ ఆటో, హీరో మోటో కార్ప్‌, కొటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలతో ముగియగా.. ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌,శ్రీ సిమెంట్‌, ఏసియన్‌ పెయింట్స్‌,ఐటీసీ, గ్రాసిం, దివిస్‌ ల్యాబ్స్‌,టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్‌ షేర్లు నష్టాల పాలయ్యాయి. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement