సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సూచీలు | Today Stock Market Closing Update | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన సూచీలు

Jan 18 2024 3:52 PM | Updated on Jan 18 2024 3:53 PM

Today Stock Market Closing Update - Sakshi

ఈ రోజు (గురువారం) నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లోనే ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 313.90 పాయింట్ల నష్టంతో 71186.86 వద్ద, నిఫ్టీ 109.70 పాయింట్ల నష్టంతో 21462.30 వద్ద ముగిసింది. ఈ రోజు కూడా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ భారీ నష్టాల్లోనే ముగిసాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. సన్ ఫార్మా, సిప్లా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, అపోలో టైర్స్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ మొదలైన కంపెనీలు చేరాయి. నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇండియామార్ట్ ఇంటర్‌మేష్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) 

Advertisement
 
Advertisement
Advertisement