Tech layoffs మరో టాప్‌ కంపెనీ నుంచి 6650 ఉద్యోగులు ఔట్‌! 

Tech Layoffs Dell To Sack 5pc Of Its Global Workforce - Sakshi

సాక్షి,ముంబై: టెక్‌ ఉద్యోగులకు మరో చేదు వార్త.  గ్లోబల్‌  ఆర్థిక  మాంద్యం భయాలు, ఆదాయాల క్షీణత పలు టెక్‌ కంపెనీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో ఖర్చుల నియంత్రలో భాగంగావేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కంప్యూటర్ల సంస్థ డెల్‌ నిలిచింది. పీసీ అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనుంది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు ఈమెయిల్‌ సమాచారం అందించింది.  

బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం  మొత్తం సిబ్బందిలో  5 శాతం ఉద్యోగులను ఉద్వాసన పలుకుతోంది. కంపెనీ మార్కెట్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందనీ ఈ అనిశ్చితి  భవిష్యత్తులో కూడా  కొనసాగుతుందని కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్  ఉద్యోగులకు తెలిపారు.  కోవిడ్‌ సంక్షోభం తరువాత, కంప్యూటర్లు ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తుల డిమాండ్‌ పెరిగి నప్పటికీ  2022 నాల్గవ త్రైమాసికంలో  వ్యక్తిగత కంప్యూటర్ షిప్‌మెంట్‌లు బాగా పడిపోయాయని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు. ప్రధానంగా  డెల్‌  కంపెనీ  అమ్మకాలు భారీ క్షీణించాయని  ఐడీసీ పేర్కొంది.  తొలగింపుల తర్వాత, డెల్‌ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

కాగా 2021లో ఇదే కాలంతో పోలిస్తే డెల్ తన పర్సనల్ కంప్యూటర్ షిప్‌మెంట్‌లలో 37 శాతంతో అతిపెద్ద క్షీణతను నమోదు చేసింది.  డెల్ ఆదాయం దాదాపు  55 శాతం పీసీల నుంచే  వస్తుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top