మరోసారి రికార్డు సృష్టించిన టీసీఎస్‌ 

 TCS beats Accenture to become mostvalued IT company worldwide - Sakshi

మరోసారి టాప్‌ కంపెనీగా  టీసీఎస్‌

మార్కెట్‌ క్యాప్‌లో యాక్సెంచర్‌ను అధిగమించిన టీసీఎస్‌

సాక్షి, ముంబై: భారతీయ సాఫ్ట్‌వేర్ సేవలసంస‍్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోసారి అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) న మరో ఐటీసంస్థ యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్‌ మార్కెట్ విలువ సోమవారం ఉదయం169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు.

కాగా మార్కెట్‌ క్యాప్‌కు సంబంధించి టీసీఎస్‌ ఇంతకుముందు రెండుసార్లు యాక్సెంచర్‌ కంపెనీని అధిగమించింది. 2018 లో ఒకసారి,  గత ఏడాది అక్టోబర్‌లో మరోసారి టీసీఎస్‌ యాక్సెంచర్‌ను దాటేసింది. అయితే 2020 అక్టోబరులో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థ టైటిల్‌ను దక్కించుకుంది.  2018 లో, యాక్సెంచర్ కంటే టీసీఎస్‌ ముందంజలో ఉన్నప్పటికీ, అ‍ప్పటికి ఐబీఎం 300 శాతం ఎక్కువ ఆదాయంతో మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది.  కాగా ఇటీవల ప్రకటించిన 2020 , డిసెంబరు త్రైమాసిక ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయాలను ప్రకటించింది.  దీంతో  3,224 రూపాయల వద్ద జనవరి 11 న, కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట స్థాయిని సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top