టాటా మోటార్స్‌ ఏడీఎస్‌కు టాటా 

Tata Motors confirms delisting from NYSE termination of ADS programme - Sakshi

న్యూఢిల్లీ: అమెరికన్‌ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్‌లు)ను స్వచ్చందంగా డీలిస్ట్‌ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్‌ చేస్తున్నట్లు తెలియజేసింది.

సోమవారం(23న) ట్రేడింగ్‌ ముగిశాక ఓవర్‌ ద కౌంటర్‌ మార్కెట్‌లో వీటి ట్రేడింగ్‌ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్‌లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్‌ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయిన టాటా మోటార్స్‌ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top