రెడీగా ఉండండి.. 18 ఏళ్ల తర్వాత ఆ దిగ్గజ సంస్థ నుంచి ఐపీఓ | Sakshi
Sakshi News home page

Tata Group: రెడీగా ఉండండి.. 18 ఏళ్ల తర్వాత ఆ దిగ్గజ సంస్థ నుంచి ఐపీఓ

Published Mon, Jul 11 2022 9:36 PM

Tata Group Plans To Ipo By Fiscal End After 18 Years - Sakshi

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకు రాబోతోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. 2004లో టీసీఎస్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత టాటా గ్రూప్‌ నుంచి ఐపీఓకు వస్తున్న సంస్థ ఇదే. టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు గత వారమే ఓ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది.

ఈ ఐపీఓకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు సిటీ గ్రూప్‌ను టాటా నియమించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా గ్రూప్‌ మరో అనుబంధ సంస్థ అయిన టాటా స్కై కూడా ఐపీఓకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఐపీఓ వార్తలపై టాటా గ్రూప్‌ స్పందించేందుకు నిరాకరించాయి.

చదవండి: Anand Mahindra: ఎలాన్‌ మస్క్‌పై ఆనంద్‌ మహీంద్రా ట్విట్‌.. అది పొగిడినట్లు లేదే..!

Advertisement
 
Advertisement
 
Advertisement