Sonu Sood: వారికోసం కొత్త ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేసిన సోనూసూద్‌..!

Sonu Sood Launched B2B Travel Tech Platform For Rural India - Sakshi

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి త‌న వంతు సాయమందిస్తూ రియ‌ల్‌ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. లాక్‌డౌన్‌ సమయంలో అనేక మందిని వారి సొంత ఊర్లకు చేరవేయడంలో సోనూసూద్‌ ఎంతగానో కృషి చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రయాణికుల అవసరాల కోసం సరికొత్త  ప్లాట్‌ఫాంను సోనూసూద్‌ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ట్రావెల్‌ ఏజెంట్ల కోసం ‘ట్రావెల్‌ యూనియన్‌’ అనే ప్లాట్‌ఫాంను సోనూసూద్‌ లాంచ్‌ చేశారు.

సోనూసూద్‌ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాట్‌ఫాం భారత తొలి గ్రామీణ బీ2బీ(బిజినెస్‌ టూ బిజినెస్‌) ట్రావెల్‌ టెక్‌ప్లాట్‌పాంగా నిలవనుంది.దీంతో గ్రామీణ ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణసేవలను పొందనున్నారు. గ్రామీణ స్థాయిలో ట్రావెలింగ్‌ సెక్టార్‌ అసంఘటితంగా ఉంది. టైర్‌ 2 పట్టణాల్లోని ప్రయాణికులకు సేవలను అందించడానికి  పలు ట్రావెలింగ్‌ సంస్థలు పెద్దగా  మొగ్గుచూపడంలేదు. గ్రామీణ ప్రయాణికుల కోసం ట్రావెల్‌ టెక్‌  ప్లాట్‌ఫామ్స్‌ అసలు లేవని ట్రావెల్‌ యూనియన్‌ సంఘాలు పేర్కొన్నాయి.  

సోనూసూద్‌ ఏర్పాటుచేసిన ప్టాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులకు తక్కువ ధరలోనే ప్రయాణాలను, ఇతర సదుపాయాలను ఆఫర్‌ చేయవచ్చునని ట్రావెల్‌ ఏజెంట్లు వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫాం మల్టిపుల్ ట్రావెల్ సర్వీస్ పార్టనర్‌లతో భాగస్వామాన్ని కల్గి ఉంది. అంతేకాకుంగా ఐఆర్‌సీటీసీ, 500కు పైగా డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ విమాన ప్రయాణాలను, 10,000కు పైగా బస్‌ ఆపరేటర్లను, 10 లక్షలకు పైగా హోటల్‌ సదుపాయాలను ఈ ప్లాట్ ఫాం ద్వారా యాక్సెస్‌ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ట్రావెల్‌ యూనియన్‌ ప్లాట్‌ఫాం ఇంగ్లీష్‌, హిందీ భాషలో అందుబాటులో ఉంది. త‍్వరలోనే మరో 11 రిజనల్‌ భాషల్లో సేవలను అందించనుంది. 

రూరల్‌ బీ2బీ ట్రావెల్‌ టెక్‌ ప్లాట్‌ఫాం ‘ట్రావెల్‌ యూనియన్‌’  లాంచ్ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ... “లాక్‌డౌన్ సమయంలో ప్రయాణాల విషయంలో గ్రామీణ భారతీయులు ఎదుర్కొనే సవాళ్లను నేను ప్రత్యక్షంగా చూశాను. గ్రామీణ ప్రయాణికులు ముందుగా తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకునే అవకాశం లేదు. వారి ప్రయాణాల కోసం మల్టీపుల్‌ ట్రావెల్‌ ఆపరేటర్లను సంప్రదించాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాంతో గ్రామీణ ప్రయాణికులు ఏలాంటి అడ్డంకులు లేని ప్రయాణ అనుభూతిని పొందవచ్చునని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top