దేశంలో స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్

Smart Speakers Sale Hits All Time High in India - Sakshi

భారతదేశంలో స్మార్ట్ స్పీకర్లకు ఆదరణ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. భారతదేశంలో విక్రయించే స్మార్ట్ స్పీకర్ల సంఖ్య 2020 సంవత్సరం చివరినాటికి 7.5 లక్షల యూనిట్లు అమ్ముడు పోతాయని టెక్ నిపుణులు అంచనా. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ 'టెక్ఆర్క్' నిర్వహించిన 'ఇండియా స్మార్ట్ స్పీకర్ మార్కెట్ స్కాన్ రిపోర్ట్' సర్వే ప్రకారం, స్మార్ట్ స్పీకర్ల మార్కెట్ లో ప్రధానంగా అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లు అగ్రస్థానంలో నిలిచాయని సర్వేలో తేలింది. 2020 జనవరి నుండి సెప్టెంబర్ వరకు 95.9% మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. కానీ షియోమి జూలై-సెప్టెంబర్ 2020 త్రైమాసికంలో 7.1 శాతం మార్కెట్ వాటాతో 2వ స్థానంలో నిలిచింది. 2 శాతం వాటాతో గూగుల్ తర్వాత స్థానంలో ఉంది. (చదవండి: భారత్‌లో స్టార్‌లింక్ హై - స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు)

టెక్‌ఆర్‌సి వ్యవస్థాపకుడు & చీఫ్ అనలిస్ట్ ఫైసల్ కవూసా మాట్లాడుతూ.. “భారతీయ గృహా వినియోగదారులు ఎక్కువగా స్మార్ట్ టెక్నాలజీల వైపు వెళ్తున్నారు, స్మార్ట్ స్పీకర్ వంటి వాయిస్-నియంత్రిత పరికరాలు ఇందులో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. వినియోగదారులకు స్మార్ట్ స్పీకర్లు అందుబాటు ధరలో ఉండటం వల్ల వీటిని కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని" తెలిపారు. 

భారత్‌లో డిస్‌ప్లేతో లభించే స్మార్ట్ స్పీకర్లను కొనుగోలు చేసే ధోరణి కూడా పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. అందుకే దేశంలో వీటికి డిమాండ్ భారీగా ఉంది. ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో డిస్‌ప్లేతో ఉండే స్మార్ట్ స్పీకర్ల షిప్‌మెంట్ గత త్రైమాసికంతో పోలిస్తే 87 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. డిస్ప్లేతో ఉండే స్మార్ట్ స్పీకర్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నందున, వాటి సగటు ధరలు కూడా కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ స్మార్ట్ స్పీకర్ డివైజ్‌ల సగటు ధర 5,560 వరకు ఉంది. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ.6,100 వరకు ఉండటం విశేషం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top