ఐటీ షాక్, నష్టాల్లో మార్కెట్లు, అయినా పటిష్టంగానే

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభం నుంచీ అమ్మకాలఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు అదే ధోరణిలో ఉన్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 202 పాయింట్లు కుప్పకూలి 6068 వద్ద,నిఫ్టీ 56పాయింట్లు బలహీన పడి 18013 వద్ద కొనసాగుతున్నాయి. ఒక దశలో 700 పాయింట్లు పతనమై 60 వేల దిగువకు చేరింది. నిఫ్టీ 50 1.13 శాతం క్షీణించి 17865 వద్దకు చేరుకుంది. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాభపడుతుండగా, ఇన్ఫోసీస్, టెక్ ఎం, టీసీఎస్ , హెచ్‌సీఎల్, టెక్, విప్రో షేర్లు భారీగా నష్టపోతున్నాయి.