సెన్సెక్స్‌ కొత్త రికార్డ్‌- ఫైనాన్స్‌ షేర్లు జూమ్‌

Sensex open with new high record- Finance shares zoom - Sakshi

243 పాయింట్లు అప్‌- 44,125కు సెన్సెక్స్‌

70 పాయింట్లు ఎగసి 12,929 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.7 శాతం ప్లస్‌‌

ముంబై, సాక్షి: దేశీ స్టాక్‌ మార్కెట్ల రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గత వారం మధ్యలో బ్రేక్‌ పడినప్పటికీ తిరిగి వరుసగా రెండో రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 44,271ను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ప్రస్తుతం 243 పాయింట్లు ఎగసి 44,125 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 12,929 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో 12,962కు చేరింది. కోవిడ్‌-19 కట్టడికి వెలువడనున్న వ్యాక్సిన్లపై అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ ప్యానల్‌ సూచనల నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ, స్మాల్‌ బ్యాంకులు తదితర ఫైనాన్షియల్‌ రంగ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది.

రియల్టీసహా..
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఐటీ, ఫార్మా 1-0.5 శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫిన్‌, ఆర్‌ఐఎల్‌, హిందాల్కో, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, యూపీఎల్‌ 3.4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో ఎయిర్‌టెల్, కోల్‌ ఇండియా‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఐవోసీ, అదానీ పోర్ట్స్ 1.2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పెట్రోనెట్‌, బాలకృష్ణ, జిందాల్‌ స్టీల్‌, చోళమండలం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, మదర్‌సన్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 4.2-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క ఎల్‌ఐసీ హౌసింగ్‌, ముత్తూట్‌, గ్లెన్‌మార్క్‌, టొరంట్‌ ఫార్మా, జూబిలెంట్‌ ఫుడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టీవీఎస్‌ మోటార్ 2-1 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.7 శాతం మధ్య ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,253 లాభపడగా.. 635 నష్టాలతో కదులుతున్నాయి.   

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,855 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top