బుల్‌ జోరు : సెన్సెక్స్‌, నిఫ్టీ ఆల్‌ టైం హై

Sensex hits all time high of 50,321 Nifty crosses 14800 - Sakshi

సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్ బడ్జెట్‌ ర్యాలీ కొనసాగుతోంది.  వరుసగా మూడో  రోజూలాభాల్లో కొనసాగుతున్న సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ ఆంరభంలోనే ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకాయి. అనంతరం మరింత ఎగిసి సెన్సెక్స్ 528 పాయింట్లు పెరిగి 50,325 గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 163 పాయింట్లు పెరిగి 14,810 గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు  అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

ప్రధానంగా రిలయన్స్, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్‌ షేర్ల లాభాలకు సూచీలకు మద్దతునిస్తున్నాయి. వీటితో పాటు ఇండస్ఇండ్ బ్యాంక్,  డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్  టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతుండగా, మరోవైపు, మారుతి, కోటక్ బ్యాంక్, ఎస్బిఐ మరియు అల్ట్రాటెక్ సిమెంట్  నష్ట పోతున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top