ఫెడ్‌పై కన్ను: భారీ నష్టాల్లో సూచీలు  | Sakshi
Sakshi News home page

ఫెడ్‌పై కన్ను: భారీ నష్టాల్లో సూచీలు 

Published Wed, Sep 21 2022 12:32 PM

Sensex falls 350 pts Nifty gives up 17700 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. యుఎస్ ఫెడ్ మీట్ ఫలితాలకు ముందు పెట్టుబడిదారుల అప్రమత్తత నేపథ్యంలో బుధవారం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్  401 పాయింట్లు క్షీణించి 59318 వద్ద, నిప్టీ 135 పాయింట్లు పతనమై 17681 వద్ద కొనసాగుతున్నాయి.

దాదాపుఅన్ని రంగాల షేర్లుఅమ్మకాల ఒత్తిడిలోఉన్నాయి.  బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.3 శాతం క్షీణించి 41339 స్థాయిలకు చేరుకుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్ టాప్ ఇండెక్స్ డ్రాగర్స్‌గా  ఉన్నాయి.  నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్,  టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, ఐటిసి షేర్లు టాప్  లాభాల్లో  ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలహీనంగా ఉంది. 22పైసల నష్టంతో 79.92 వద్ద ఉంది.

ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ నేతృత్వంలోని పాలసీ  మీట్‌ ఈ రోజుతో ముగియనుంది.  75 బీపీఎస్‌  వడ్డీ రేటు పెంపును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. 100 బీపీఎస్‌ పాయింట్లు పెంచవచ్చని కూడా  చాలా మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement