భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌: కీలక మద్దతు స్థాయిలు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

StockMarketOpening: నష్టాల్లోకి సూచీలు, కీలక మద్దతు స్థాయిలు బ్రేక్‌

Published Fri, Nov 18 2022 11:12 AM

Sensex and nifty slips into red market down 300 points - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ, వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 312 పాయింట్లు కుప్పకూలి 61437 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల పతనమై 18244 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు వారాంతం కావడంతో టట్రేడర్ల లాభాల స్వీకరణ కొనసాగుతోంది.  తద్వారా సెన్సెక్స్‌ 61500 దిగువకు, నిఫ్టీ 18300 స్థాయిని  కోల్పోయి మరింత  బలహీన సంకేతాలిస్తున్నాయి.

కోటక్‌ మహీంద్ర బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, టాటామోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫినాన్స్‌ తదితరాలు లాభపడుతున్నాయి. ఎయిర్టెల్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటార్స్‌, టైటన్‌, టాటా కన్జ్యూమర్స్‌ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి నష్టాల్లో ఉంది. 81.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 

Advertisement
Advertisement