హైదరాబాద్‌లో ఎస్‌బీఐ యోనో తొలి బ్రాంచ్‌ | SBI launches YONO branches in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎస్‌బీఐ యోనో తొలి బ్రాంచ్‌

Sep 24 2020 6:16 AM | Updated on Sep 24 2020 6:16 AM

SBI launches YONO branches in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ బ్యాంక్‌ హైటెక్‌ సిటీలో తొలి యోనో బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చల్లా శ్రీనివాస్‌లు వర్చువల్‌ పద్ధతిలో ఈ బ్రాంచిని ఆవిష్కరించారు. ఇది సౌతిండియాలో మొదటిదికాగా, దేశంలో 4వది  కావడం విశేషం. ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలను యోనో ప్లాట్‌ఫామ్‌ ద్వారా అందించనుంది. బ్రాంచి ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓపీ మిశ్రా మాట్లాడుతూ ‘‘యోనో కేవలం ప్రొడెక్ట్‌ మాత్రమే కాదు. దాదాపు అన్ని బ్యాంక్‌ సేవలను అందించే వేదిక’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement