ఆగని ఉద్యోగాల కోత.. శాప్‌ ల్యాబ్స్‌ నుంచి 300 మంది అవుట్

Sap labs lays off 300 indian employees - Sakshi

SAP ల్యాబ్స్ భారతదేశ కేంద్రాలలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించింది. గ్లోబల్ డెలివరీ సెంటర్‌ మూసివేయడం వల్ల ఈ తొలగింపు జరిగిందని సంస్థ తెలిపింది. ఇందులో ఎక్కువ మంది బెంగళూరు, గురుగ్రామ్ కార్యాలయాల్లో పనిచేసేవారు ఉండటం గమనార్హం.

నివేదికల ప్రకారం, కంపెనీ తొలగించిన ఉద్యోగులలో దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు. రిట్రెంచ్‌మెంట్ తర్వాత వీరందరికి కంపెనీ మంచి ప్యాకేజీ, ఇతర ప్రయోజనాలను అందిస్తూ మార్గం చూపుతుంది.

ఉద్యోగుల తొలగింపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన వ్యూహాత్మక పరివర్తన, ఇది ప్రస్తుతం తొలగింపుకి గురైన ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త ఉద్యోగుల నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొంతమంది చెబుతున్నారు.

గత నెలలో, శాప్‌ ల్యాబ్స్‌ యొక్క మాతృ సంస్థ శాప్‌ ప్రపంచవ్యాప్తంగా దాని "కోర్ బిజినెస్"పై దృష్టి పెట్టడానికి తొలగింపులను ప్రకటించింది. దీని వల్ల 3 వేలమంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్ 2022తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ తొలగింపులు ప్రకటించింది.

(ఇదీ చదవండి: తడబడిన ట్విటర్.. నిమిషాల్లో వేల పిర్యాదులు)

2025 నాటికి కంపెనీ భారతదేశంలోని హెడ్‌కౌంట్‌ రెట్టింపు చేయనున్నట్లు, దీనికోసం దాదాపు 15,000 మంది సామర్థ్యంతో బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో కొత్త క్యాంపస్‌ ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే 41 ఎకరాల భూమిని కొనుగోలోను చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్, స్విగ్గీ, గూగుల్ వంటి సంస్థలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో శాప్‌ ల్యాబ్స్‌ కూడా చేరింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఈ జాబితాలోకి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా చేరతాయనటంలో ఎటువంటి సందేహం లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top