Riva Arora gets Audi car worth over Rs 44 lakh as gift, fans comments viral - Sakshi
Sakshi News home page

అందాల చిన్నది లగ్జరీ కారు: ఫోటోలు వైరల్‌, నెటిజన్ల కామెంట్స్‌ చూడాలి!

Mar 21 2023 3:02 PM | Updated on Mar 21 2023 3:24 PM

Riva Arora gets Audi car worth Rs 44 lakh as gift fans comments viral - Sakshi

సాక్షి, ముంబై: బాలనటి, టీనేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్. రివా అరోరా (13)రూ. 44 లక్షల విలువైన ఆడి కారును సొంతం చేసుకుంది. ఈమేరకు బ్లాక్‌ ఆడి కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు.  అసలు డ్రైవింగ్‌ లైసెన్స్  ఉందా ('డ్రైవింగ్ లైసెన్స్ బనా హై?') అంటూ మరి కొంతమంది ప్రశ్నించారు. 

రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తల్లి  నిషా ఆమెకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చింది. 44 లక్షలకు పైగా విలువైన బ్లాక్ ఆడి క్యూ3 కారుతో ఫోజులిస్తూ  రివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను తమ ప్యాన్స్‌తో పంచుకుంది. కొంచెం ఆలస్యమైనాగానీ, మొత్తానికి సెలబ్రేట్‌ చేసుకుంటున్నా..ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. 10.6 మిలియన్  ఇన్‌స్టా ఫ్యామిలీ ఎంతో అపురూపమైన ప్రేమకు, అభిమానానికి  ధన్యవాదాలు అంటూ పోస్ట్‌ పెట్టింది. దీంతో లైసెన్స్‌  ఉందా ముందు లైసెన్స్‌ తీసుకో అంటూ నెటిజన్లు  విమర్శిస్తున్నారు.

రివా అరోరా ఎవరంటే?
రివా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న టీనేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్.  అంతేకాదు మామ్, మణికర్ణిక, మర్ద్ కో దర్ద్ నహీ హోతా, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ది సర్జికల్ స్ట్రైక్ , గుంజన్ సక్సేనాలో నటించింది. ఆమె చివరిగా రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతో ఆకట్టుకుంది.  కాగా  మికా సింగ్, కరణ్ కుంద్రాలతో రొమాంటిక్ రీల్‌ చేయడంపై చిన్నపిల్లతో  డ్యాన్సులా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.  2010లో పుట్టిందని భావిస్తున్న రివా వయసుపై వివాదం ఉంది. అయితే  తన వయసు 12 కాదంటూ రివా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే  రివా వయసు  12 కాదు 16 ఏళ్ల అని నిషా తల్లి ప్రకటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement