రిలయన్స్‌ జియోకు గ్లోబల్‌ అత్యున్నత రేటింగ్‌, ఎందులోనంటే..

Reliance Jio gets highest Rating on CDP 2021 Global Environment Impact - Sakshi

న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియోకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్‌షిప్‌ రేటింగ్‌ దక్కింది.

లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ, 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ జాబితాలో, భారత్‌ నుంచి లీడర్‌షిప్‌ ర్యాంకింగ్‌ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్‌ సంస్థ రిలయన్స్‌ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్‌ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువ గల 272 కంపెనీలను ఈ జాబితా కోసం మరింపు చేసినట్లు సీడీపీ తెలిపింది. వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. గతేడాది ’బి’ రేటింగ్‌ నుంచి జియో ఈ ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్‌టెల్‌ రేటింగ్‌ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది.

చదవండి: ట్రాయ్‌కు రిలయన్స్‌ జియో ఫిర్యాదు! ఎందుకంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top