global ratings
-
జీడీపీ వృద్ధికి ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.7 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను తాజాగా 6.5 శాతానికి సవరించింది. 2024–25 సంవత్సరం మాదిరే వృద్ధి అంచనాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే రుతుపవనకాలం సాధారణంగా ఉంటుందని, కమోడిటీ, చమురు ధరలు కనిష్ట స్థాయిల్లోనే ఉంటాయన్న అంచనాల ఆధారంగా ఈ వృద్ధి రేటును ఇస్తున్నట్టు ఎస్అండ్పీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడం, బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, తక్కువ రుణ వ్యయాలు ఇవన్నీ భారత్‌లో విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతాయని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై అమెరికా టారిఫ్‌ల పెంపు ప్రభావం, ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో చాలా వాటిల్లో దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్‌లు ఈ ఏడాది అంతటా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది. ఒక శాతం వరకు రేట్ల తగ్గింపు.. ‘‘ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 0.75 శాతం నుంచి 1 శాతం వరకు ప్రస్తుత సైకిల్లో తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ చమురు రేట్ల ఫలితంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి 4 శాతానికి సమీపంలో 2025–26లో ఉండొచ్చు’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. బలమైన దేశీ డిమాండ్‌తో వర్ధమాన దేశాలు నిలదొక్కుకుంటాయని పేర్కొంది. దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో 2025లో యూఎస్ ఫెడ్ మరొక్కసారే 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీకి నష్టంఏటా 3 శాతం కోల్పోవాల్సి వస్తోంది: గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో ఏటా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి కారణంగా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తోందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్–భారత్ భాగస్వామ్యంతో ఢిల్లీలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. దేశానికి రహదారి ప్రమాదాలు అతి ముఖ్యమైన సమస్యగా ఉన్నట్టు చెప్పారు. ఏటా 4.80 లక్షల రహదారి ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. ఇందులో 10,000 మంది 18 ఏళ్లలోపు ఉంటుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదొక ప్రధానమైన ప్రజారోగ్య సమస్యే కాకుండా, ఏటా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఖర్చు ఆదా చేసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాలను సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతన్నట్టు చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సాయాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ప్రమాద బాధితుల సాయానికి ముందుకు వచ్చే మూడో పక్ష వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రమాదం లేదా ప్రమాదం అనంతరం ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గరిష్టంగా రూ.1,50,000 లేదా ఏడేళ్ల పాటు చికిత్స వ్యయాలకు చెల్లింపులు చేయనున్నాం’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. -
రిలయన్స్ జియో అరుదైన ఘనత
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా కార్యకలాపాలు నిర్వహించే సంస్థల జాబితాలో జియోకు అత్యుత్తమ ’ఎ–’ లీడర్షిప్ రేటింగ్ దక్కింది. లాభాపేక్ష రహిత సంస్థ సీడీపీ, 2021 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ జాబితాలో, భారత్ నుంచి లీడర్షిప్ ర్యాంకింగ్ దక్కించుకున్న ఏకైక టెలికం/డిజిటల్ సంస్థ రిలయన్స్ జియోనే. మరో టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు ’సి’ రేటింగ్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల 272 కంపెనీలను ఈ జాబితా కోసం మరింపు చేసినట్లు సీడీపీ తెలిపింది. వాతావరణ మార్పులు, అడవులు.. నీటి సంరక్షణ వంటి అంశాల్లో ఆయా కంపెనీల పనితీరు, వాటి పారదర్శకత స్థాయి ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. గతేడాది ’బి’ రేటింగ్ నుంచి జియో ఈ ఏడాది మరో అంచె ఎదిగింది. భారతి ఎయిర్టెల్ రేటింగ్ 2020లో ’డి–’ నుంచి ఈసారి ’సి’ స్థాయికి మెరుగుపడింది. చదవండి: ట్రాయ్‌కు రిలయన్స్ జియో ఫిర్యాదు! ఎందుకంటే.. -
బైడెన్‌ను దాటిన మోదీ.. ప్రపంచలోనే నెంబర్ వన్‌గా..
న్యూఢిల్లీ: ప్రపంచ నాయకులపై సర్వే నిర్వహించే అమెరికన్ డాటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ తన తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది జనామోదం పొందిన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అగ్రదేశాధినేతలకన్నా ముందు వరుసలో ఉన్నారు. అమెరికా, బ్రిటన్ రష్యా, అస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్ వంటి 13 దేశాల నాయకులను వెనక్కినెట్టి మోదీ విశ్వనాయకుడిగా స్థానం సంపాదించుకున్నారు. జూన్ 17న ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఫలితాలు విడుదల చేసిన ఈ సర్వేలో భారత్‌లో 2,126 మందిని సర్వే చేశారు. ఇందులో 66 శాతం మంది.. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆమోదం తెలిపారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది ప్రధాని స్కోరు పడిపోయింది. 2019 ఆగష్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఇదే సర్వేలో 82 శాతం మంది మోదీని ఆమోదించగా, కేవలం 11 శాతం మంది వ్యతిరేకించారు. ఈ జూన్ నాటికి ఆ రేటింగ్ 66 శాతానికి పడిపోగా.. 28 శాతం మంది నిరాకరించారు. అప్పటితో పోల్చితే ప్రస్తుతం ప్రజాదరణ 16 పాయింట్లు తగ్గింది. సర్వేలో మోదీ తర్వాత ఇటాలియన్ ప్రధానమంత్రి మారియో ద్రాగి రెండో స్థానంలో ఉన్నారు. ఆయన రేటింగ్ 65 శాతం. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ మూడవ స్థానంలో 63 శాతం రేటింగ్‌తో ఉన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన్ను 53 శాతం మంది ఎంచుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేసినట్టు తెలిపింది. చదవండి: స్టార్టప్‌లకు ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద వ్యవస్థ: ప్రధాని -
మొండిబకాయిలు.. బాబోయ్!
⇔ మొత్తం రుణాల్లో 15 శాతానికి చేరే అవకాశం ⇔ అత్యధికంగా ఎన్పీఏలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ⇔ పెరగనున్న పీఎస్‌బీల మూలధన అవసరాలు ⇔ బ్యాంకింగ్ రంగంపై 2018 నాటికి ఎస్అండ్పీ అంచనా న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి దేశీయంగా బ్యాంకుల్లో మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం మొత్తం రుణాల్లో 15 శాతా నికి చేరనున్నాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణమైన మూలధన అవసరాలు మాత్రం 2019 దాకా పెరుగుతూనే ఉంటాయి. భారతీయ బ్యాంకుల కష్టాలు, చికిత్స మీద ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 మార్చి ఆఖరు నాటికి బ్యాంకింగ్ రంగంలో మొత్తం నిరర్ధక ఆస్తుల పరిమాణం 13–15 శాతం దాకా పెరగొచ్చని, ఈ రుణాల్లో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే ఉండనుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ దీపాలీ సేఠ్ చాబ్రియా తెలిపారు. తాము రేటింగ్ ఇస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ఏటా నిరర్ధక రుణాల పరిమాణం పెరుగుతుండటం.. అధిక ప్రొవిజనింగ్‌కు, లాభాలు తగ్గడానికి కారణమవుతోందని వివరించారు. దీంతో అనూహ్య నష్టాలను భరించేం దుకు అందుబాటులో ఉన్న మూలధనం చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. రాబోయే 12 నెలల్లో బ్యాంకుల రుణ పరపతి మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదని నివేదికలో ఎస్అండ్పీ తెలిపింది. దశాబ్ద కనిష్టానికి రుణాల వృద్ధి.. రుణాల మంజూరులో వృద్ధి ప్రస్తుతం దశాబ్ద కనిష్ట స్థాయిలో ఉన్నట్లు ఎస్అండ్పీ పేర్కొంది. బాసెల్ త్రీ నిబంధనలకు అనుగుణంగా మూలధనం సమకూర్చుకోవాలంటే బ్యాంకులు ఇతరత్రా వనరులపై ఆధారపడాల్సి రావొచ్చని లేదా ప్రాధాన్యేతర ఆస్తులను విక్రయించుకోవాల్సి ఉంటుందని దీపాలీ చెప్పారు. ఏదైనా సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికి ఆస్కారం లేకుండా బ్యాంకుల వద్ద మూలధనం తక్కువ స్థాయిలో ఉందని, లాభసాటిగా లేని ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాల్లో కోత విధించుకోవాల్సి కూడా రావొచ్చని దీపాలీ చెప్పారు. నిబంధనల ప్రకారం మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం 2019 దాకా పెరుగుతూనే ఉండొచ్చని, లాభదాయకత మాత్రం ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు. 2016–19 మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) రూ. 70,000 కోట్లు కేంద్రం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. అయితే, పీఎస్‌బీల అవసరాలు పూర్తిగా తీర్చేందుకు ఈ నిధులు సరిపోవని ఎస్అండ్పీ తెలిపింది. మూలధనం కొరత, అసెట్ క్వాలిటీ సమస్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కన్సాలిడేషన్‌కు తెరతీయొచ్చని పేర్కొంది. ప్రభుత్వం మూలధనం సమకూర్చడం, అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడం భారతీయ పీఎస్‌బీల రేటింగ్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషించగలవని ఎస్అండ్పీ తెలిపింది. -
వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం
భారత్‌పై ఎస్అండ్పీ నివేదిక న్యూఢిల్లీ: భారత్ 8 శాతం వృద్ధి సాధనకు వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని గ్లోబల్ రేటింగ్స్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తన తాజా నివేదికలో తెలిపింది. దివాలా బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని ఈ సందర్భంగా ప్రశంసించిన ఎస్అండ్పీ.. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తదుపరి లక్ష్యంగా ఉండాలని సూచించింది. చైనా, తదితర ఆర్థిక వ్యవస్థల ఒడిదుడుకుల నుంచి భారత్ తట్టుకుని నిలబడగలుగుతున్నట్లు వివరించింది. గడచిన ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.6 శాతం కాగా, అది 2016-17లో 7.9 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 8 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. తగిన వర్షపాతం అంచనాలు నిజంకావడంసహా... ఫైనాన్షియల్ మార్కెట్ స్థిరపడ్డం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును ఇచ్చే బడ్జెట్, సంస్కరణల పథంలో దేశం ముందుకు సాగుతుండటం వంటి అంశాలు... ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఇబ్బందులను తగ్గిస్తున్నట్లు ఎస్అండ్పీ అభిప్రాయపడింది. గ్రామీణ వినియోగం పెరుగుతుందని, వృద్ధికి పెట్టుబడుల మద్దతు ఉంటుందని తాను ఇప్పటికీ విశ్వసిస్తున్నట్లు తన ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్షార్ట్స్లో రేటింగ్ సంస్థ పేర్కొంది.