
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్.. ముంబై నడిబొడ్డున 2,000 పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని 'నీతా అంబానీ' రిలయన్స్ ఫౌండేషన్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.
సంస్థ నిర్మిస్తున్న మెడికల్ సిటీ, కేవలం మరో హాస్పిటల్ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు కొత్త మార్గదర్శి. ఇక్కడ ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్, లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ వంటివాటితో పాటు.. ప్రపంచంలోని కొంతమంది అత్యుత్తమ వైద్యులు ఉంటారని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్‌పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.
భవిష్యత్ తరాల ఆరోగ్య సంరక్షణ కోసం, నిపుణులను పెంపొందించడమే లక్ష్యంగా.. ఈ మెడికల్ సిటీలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇది మన దేశానికి గర్వకారణమవుతుందని, ప్రపంచమే మనవైపు చూస్తుందని అన్నారు. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల సేవలను గుర్తుచేసుకుంటున్న సందర్భంగా నీతా అమ్బనీ ఈ ప్రకటన చేశారు.
ఇదీ చదవండి: జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీ
భారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన 'సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్' ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా రోగులకు సేవలందించింది. ఇందులో కూడా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి వాటికోసం జీవన్ అనే కొత్త విభాగం ప్రారంభించనున్నట్లు.. లేటెస్ట్ పీడియాట్రిక్ ఆంకాలజీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నీతా అంబానీ వివరించారు.
48th #RILAGM | Nita Ambani, Founder Chairperson, Reliance Foundation, addresses the Annual General Meeting.
- Reached 87 m people across India through Reliance Foundation in 15 years
- New 2,000-bed medical city in Mumbai
- Touched the lives of 23 m children
- Sir HN Reliance… pic.twitter.com/GEyfsRMfHC— CNBC-TV18 (@CNBCTV18News) August 29, 2025