ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI Governor Shaktikanta Das Announced That Repo Rate Hikes - Sakshi

ద్రవ్యోల్బణ కట్టడి ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపోరేటు, క్యాష్‌ రిజర్వ్‌ రేషియో రేట్లను పెంచుతూ బుధవారం అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉన్నందున ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు.

ఆర్బీఐ తాజా నిర్ణయం ప్రకారం రేపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రేపేవడ్డీ రేటు 4.40 శాతానికి పెరిగింది. ఈ పెంపు తక్షణమే (2022 మే 4) అమల్లోకి వస్తుందని తెలిపారు. క్యాష్‌ రిజర్వ్‌ రేషియోను 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపు మే 21 నుంచి అమల్లోకి రానుంది. చివరి సారిగా 2018 ఆగస్టులో వడ్డీరేట్లు ఆర్బీఐ పెంచింది.

కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఎదురయ్యాయి. క్రమంగా ఈ పరిస్థితులు గాడిన పడే సమయంలో ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చి పడింది. దీంతో యూరప్‌, అమెరికా సహా అనేక దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. మరోవైపు అతి పెద్ద సరఫరాదారుగా ఉక్రెయిన్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి తగ్గిపోయింది. కనుచూపు మేరలో కూడా వేగం పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఆర్బీఐ సర్థుబాటు ధోరణికి స్వస్తి పలికి రేపు రేటు, క్యాష్‌ రిజర్వ్‌ రేషియో రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది.

అంతకు ముందు మార్చిలో జరిగిన ఆర్బీ​ఐ సాధారణ సమావేశంలో రేపో రేటు పెంచుతారని అంచనాలు నెలకొనగా ఆర్బీఐ సర్థుబాటు ధోరణి అవలంభించింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడలేదు. మరోవైపు రేపో రేటు తగ్గించడం నేరం కాదంటూ మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వంటి వారు కామెంట్లు చేశారు. ఈ తరుణంలో జూన్‌లో ఆర్బీఐ సమాశం జరగాల్సి ఉండగా ఒక నెల ముందుగానే ఆర్బీఐ అత్యవసర సమావేశం నిర్వహించింది. కీలక నిర్ణయాలను వెల్లడించింది. 

చదవండి: ఆర్బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌ సూచీలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top