Punjab: Bank Clerk Wins Rs.1 Crore In Lottery Ticket Within An Hour In Gurdaspur - Sakshi
Sakshi News home page

ఇది కదా లక్‌ అంటే.. గంటలో కోటి!

Jul 17 2023 12:45 PM | Updated on Jul 17 2023 1:14 PM

punjab bank clerk wins a jackpot of Rs. crore in the lottery within an hour of taking the ticket - Sakshi

Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ  టికెట్లు కొంటూనే ఉంటారు.  ఆ బంపర్ఎ‌ ప్రైజ్‌ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే  ఉంటారు.  కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే  కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్‌పాట్‌ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి  కావడం అతని వంతైంది.

వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్‌, గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్‌మెంట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా  లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు  కానీ ఇంత తొందరగా  లక్ష్మీ దేవి తన  ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు.  (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్‌!)

ఎప్పటిలాగే రూపీందర్‌జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు  రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు  గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు  సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్‌. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ  డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్‌ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌: మరింత గడ్డు కాలం?)

తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్‌జిత్‌ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు.  కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది.  (

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement