ప్రాపర్టీ డీల్‌: హీరో షారుఖ్ భార్య, గౌరీ ఖాన్‌కు షాక్‌!

UP police files FIR against Gauri Khan in Lucknow over property purchase - Sakshi

సాక్షి, ముంబై:  బాలీవుడ్‌  స్టార్‌ హీరో షారూఖ్ ఖాన్ భార్య, ఇంటీరియర్  డిజైనర్ గౌరీ ఖాన్‌పై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.ముంబైకి చెందిన వ్యక్తి మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.

గౌరీబ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ డబ్బలు తీసుకుని కూడా ఫ్లాట్‌ అప్పగించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా  ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్‌ నిమిత్తం రూ. 86 లక్షలు చెల్లించినప్పటికీ తనను కాదని ఆ ఫ్లాట్‌ను  వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ప్రభావంతో తాను  సదరు ఫ్లాట్ కొన్నానని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో గౌరీతో పాటు తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని,  డైరెక్టర్ మహేష్ తులసియానిపై కూడా ఫిర్యాదు నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top