సౌత్‌పై కన్నేసిన ఫిజిక్స్‌వాలా..  మూడేళ్లలో రూ. 500 కోట్లు..

Physics Wallah partners with Xylem to strengthen southern - Sakshi

న్యూఢిల్లీ: యూనికార్న్‌ స్టార్టప్‌ సంస్థ ఫిజిక్స్‌వాలా మూడేళ్లలో ఎడ్‌టెక్‌ సంస్థ జైలెమ్‌ లెర్నింగ్‌ను సొంతం చేసుకోనుంది. కేరళ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ ఎడ్‌టెక్‌ సంస్థలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఫిజిక్స్‌వాలా పేర్కొంది. ఇందుకు రానున్న మూడేళ్లలో దశలవారీగా రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్‌ పాండే వెల్లడించారు. తద్వారా దక్షిణాది మార్కెట్లో మరింత పట్టుసాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు.

రెండు సంస్థల కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఈక్విటీ, నగదు ద్వారా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా జైలెమ్‌ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 500 కోట్లు వెచ్చించడం ద్వారా హైబ్రిడ్‌ లెర్నింగ్‌ జైలెమ్‌ మోడల్‌ను సరిహద్దు రాష్ట్రాలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ అవలంబిస్తున్న ఫలితాలు సాధించే ప్రణాళికల శిక్షణా విధానం తననెంతో ఆకట్టుకున్నట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top