పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే! | Older iPhones set to get costlier in India | Sakshi
Sakshi News home page

పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే!

Mar 28 2026 3:58 PM | Updated on Mar 28 2026 4:45 PM

Older iPhones set to get costlier in India

యాపిల్ కంపెనీ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం.. భారతదేశంలో ఐఫోన్ ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో పాత మోడల్స్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 15 కొనాలనుకునే వినియోగదారులకు ఇది కొంత భారంగా మారనుంది.

డిమాండ్ జనరేషన్ (DG) సపోర్ట్ అందుబాటులో ఉన్నప్పుడు.. దీని ద్వారా యాపిల్ తన రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని రాయితీలు (ఇన్సెంటివ్‌లు) ఇస్తుంది. ఈ ఇన్సెంటివ్‌ల వల్ల రిటైలర్లు ఫోన్లను తక్కువ ధరకు అమ్మగలిగేవారు. అంటే.. ఫోన్ అధికారిక ధర (MRP) మారకపోయినా, వినియోగదారులకు తగ్గింపు ధరలో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ DG సపోర్ట్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.

కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల.. రిటైలర్లు ఇకపై అంతటి తగ్గింపులు ఇవ్వలేరు. అందువల్ల.. వినియోగదారులు అదే ఫోన్ కొనడానికి సుమారు రూ.5,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా కొంచెం పాత మోడళ్లను.. తక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి ప్రభావం చూపుతుంది.

ఇది మాత్రమే కాకుండా.. యాపిల్ ముందుగా ఇచ్చిన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా గణనీయంగా తగ్గించింది. గతంలో రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తే, ఇప్పుడు అది కేవలం రూ.1,000కు తగ్గింది. దీంతో కొత్త మోడళ్లైన iPhone 17 సిరీస్ కూడా వినియోగదారులకు కొంత ఖరీదైనదిగా అనిపిస్తోంది. అయితే, ఈ DG సపోర్ట్ తొలగింపు కొత్త iPhone 17 మోడళ్లకు వర్తించదు. ఇది ప్రధానంగా పాత మోడళ్లకే పరిమితం.

ఇదీ చదవండి: అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement