Fact Check: ఆ జీఎస్‌టీ వార్తలు తప్పు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం | No GST on residential premises if rented out for personal use | Sakshi
Sakshi News home page

Fact Check: ఆ జీఎస్‌టీ వార్తలు తప్పు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Aug 13 2022 6:38 AM | Updated on Aug 13 2022 10:38 AM

No GST on residential premises if rented out for personal use - Sakshi

న్యూఢిల్లీ: నివాస అద్దెలపై ఎటువంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్‌టీ కింద నమోదైతే నివాస గృహాల అద్దెలపైనా కిరాయిదారు 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలంటూ వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది. నివాస యూనిట్లను (ఇళ్లు, ఫ్లాట్లు) కార్యాలయం, వ్యాపార వినియోగానికి అద్దెకు ఇచ్చినప్పుడే జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

‘‘ఒక వ్యక్తి నివాసం కోసం ఇల్లు అద్దెకు తీసుకుంటే దానిపై జీఎస్‌టీ లేదు. ఒక వ్యాపార సంస్థ యజమాని లేదా భాగస్వామి తన వ్యక్తిగత నివాసానికి అద్దెకు తీసుకున్నా జీఎస్‌టీ ఉండదు’’అని కేంద్ర సర్కారు ఓ ట్వీట్‌ ద్వారా స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత జీఎస్‌టీ రిజిస్టర్డ్‌ వ్యాపారస్తులకు ఊరటనిస్తుందని కేపీఎంజీ ఇండియా పార్ట్‌నర్‌ అభిషేక్‌ జైన్‌ పేర్కొన్నారు. వారు తమ నివాస గృహాల అద్దెపై జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement