StockMarketOpening: ప్రాఫిట్ బుకింగ్,18400 దిగువకు నిఫ్టీ

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 61757 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18367 వద్ద కొనసాగుతున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరడంతో మంగళవారం రికార్డు స్థాయి వద్ద ముగిసిన సెన్సెక్స్ బుధవారం ప్రారంభంలోనే నష్టాలను చవి చూసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస షేర్లు నష్ట పోతున్నాయి.
డా. రెడ్డీస్, సిప్లా, టీసీఎస్, అదానీపోర్ట్స్ లాభాల్లోనూ, దివీస్ ల్యాబ్స్, టాటాస్టీల్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. 51 పైసల నష్టంతో 81.50 వద్ద ట్రేడ్ అవుతోంది.