రికార్డ్‌ స్థాయిలో పెరిగిన ఐటీ నియామకాలు

Naukri: Hiring activities spike in February - Sakshi

ఫిబ్రవరిలో భారీ పెరుగుదల 

28 శాతం హైరింగ్స్‌తో 2వ స్థానంలో హైదరాబాద్‌ 

ముంబై: డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ కారణంగా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్‌ స్థాయిలో మంచి వృద్ధి నమోదైంది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1,925 జాబ్స్‌ హైరింగ్స్‌ జరగగా.. గత నెలలో 2,356 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, మార్కెట్‌ సాధారణ స్థితికి చేరుకోవటంతో కోవిడ్‌-19 తర్వాత తొలిసారిగా మెజారిటీ పరిశ్రమలలో నియామక కార్యకలాపాలలో సానుకూల థృక్పదాన్ని సాధించాయని నివేదక వెల్లడించింది. నగరాల వారీగా చూస్తే.. దేశంలోని ఆరు మెట్రో నగరాలు, ప్రధాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జాబ్స్‌ హైరింగ్‌లో సానుకూల వాతావరణ నెలకొంది. గత నెలలో 31 శాతం నియామక వృద్ధితో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. 28 శాతంతో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. పుణేలో 24 శాతంగా ఉన్నాయి. వడోదరలో 20 హైరింగ్స్‌ ధోరణి కనిపించింది.  

చదవండి: 

అమెజాన్‌.. వెనక్కి తగ్గాలి

బీమా సంస్థలలో భారీ వాటాల విక్రయం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top